
* తల్లి దండ్రుల అభ్యర్థనకు స్పందించిన సీతక్క
* కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్న శ్రీరాం
* దాతలను ఆర్థిక సహాయం కోరిన తల్లిదండ్రలు
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం (మేడారం) గ్రామానికి చెందిన గజ్జెల రవి స్వాతి దంపతుల కుమారుడు శ్రీరామ్ ఇటీవల కిడ్నీ, లివర్ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.మెరుగైన వైద్యం కోసం లక్షల్లో నగదు అవసరం అవుతుండడంతో శ్రీరామ్ తల్లి స్వాతి దాతల సాయం కోరింది.ఈ విషయం వాట్సాప్ ద్వారా తెలిసిన రాష్ట్ర మంత్రి సీతక్క శ్రీరామ్ కు అవసరమైన వైద్యం వ్యక్తిగతంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.కాగా చిన్నారి శ్రీరామ్ ఇప్పటికే ఎంజీఎం లో చికిత్స పొందుతున్నారు.మంత్రి పి ఏ, సంతోష్ శ్రీరామ్ ను మరిన్ని వైద్య పరీక్షల కోసం హనుమకొండ లోని గ్రావిడ్ హోమ్ పిల్లల ఆస్పత్రి కి తీసుకోని వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.వైద్య పరీక్ష అనంతరం వైద్యులు శ్రీరామ్ కు పిత్తాశయంలో మూడు రాళ్లు, సికెల్ సెల్ ఎనీమియా (రెండు మూడు నెలలకు ఒకసారి రక్తం తగ్గిపోవడం) అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు. దీనిని మంత్రి కి వివరించారు.వెంటనే మంత్రి వైద్యులు, బాధితులతో వీడియో కాల్ మాట్లాడారు. అనంతరం మంత్రి చిన్నారి శ్రీరామ్ కు అవసరమైన ఉన్నత వైద్యం హైదరాబాద్ లో అందిస్తామని హామీ ఇచ్చారు.
…………………………………….