
ఆకేరున్యూస్, ములుగు : ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ జైలులో ఉన్న ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి లఖ్మాను ఆయన కుటుంబసభ్యులను, అనుచరులను మంత్రి సీతక్క పరామర్శించి సంఫీుభావం తెలిపారు. అనంతరం స్థానిక మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యే, ఆదివాసిల అగ్రనేత కవాసీ లఖ్మాని అకారణంగా అరెస్టు చేశారన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో,భాగంగానే లఖ్మాని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందని ఆరోపించారు.నిరాధారమైన కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఎలాంటి, సాక్షాదారాలు లేకుండానే తప్పుడు కేసులతో ఆరు నెలలుగా జైలులో పెట్టారని, బస్తర్లో ఆదివాసీల గొంతుకగా ఉన్న లఖ్మా అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని, మంత్రి సీతక్క అన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలను బీజేపీ ప్రభుత్వం బలవంతంగా తరిమి వేస్తోందని ఆదివాసీల అణచివేతలో భాగంగానే లఖ్మాపై తప్పుడు కేసులు నమోదు చేశారని కవాసీ లఖ్మా కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలుస్తోందన్నారు.ఆయనకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతోందని తెలిపారు.మంత్రి సీతక్క వెంట ట్రైకార్ చైర్మన్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ తదితరులు ఉన్నారు.
…………………………………