
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా లో గోవిందరావుపేట మండల కేంద్రంలో అర్హులైన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలందరికీ ప్రతి సంక్షేమ పథకం అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డు లేని వారందరికీ దఫాలు వారీగా కార్డు లు పంపిణీ చేస్తామని తెలిపారు .రేషన్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని సద్వినియోగ పర్చుకోవాలని కోరారు .అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా సివిల్ సప్లై అధికారి రమాపతి , గ్రంధాలయం చైర్మన్ రవిచందర్, మార్కెట్ చైర్మన్ కళ్యాణి , అదనపు కలెక్టర్ మహేందర్ జి, తహసిల్దార్ సృజన్ , మండల పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
…………………………………