Mirzapur The Movie
* ‘మిర్జాపూర్ ది మూవీ’ ఫ్రెష్ ఫిల్మ్.. కొత్త సన్నివేశాలు, మలుపులతో ఉంటుంది
* సిరీస్ చూడకపోయినా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.. తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్లలో సెలబ్రేట్ చేస్తారన్న నమ్మకం: దివ్యేందు శర్మ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రముఖ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’కు కొనసాగింపుగా తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ డ్రామా ‘మిర్జాపూర్ ది మూవీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. సెప్టెంబర్ 4న హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది.
* తెలుగు ప్రేక్షకుల ప్రేమ ప్రత్యేకం
పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. ఇప్పుడు అదే కథా ప్రపంచాన్ని పెద్ద తెరపైకి తీసుకొచ్చామని తెలిపారు. తాను నటించిన కాలీన్ భయ్యా పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానించారని, తనను కాలీన్ భయ్యా అని పిలిచారని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. సినిమా కూడా అందరినీ అలరిస్తుందని అన్నారు.
* సిరీస్ చూడకపోయినా సినిమా చూడొచ్చు
దివ్యేందు శర్మ మాట్లాడుతూ ‘మిర్జాపూర్’ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరించారని తెలిపారు. సినిమాలోనూ అదే రియలిస్టిక్నెస్ కొనసాగుతుందని చెప్పారు.
‘మిర్జాపూర్ ది మూవీ’ స్టాండలోన్ ఫిల్మ్ అని, సిరీస్‌లో ఒక్క ఎపిసోడ్ కూడా చూడని వారు కూడా థియేటర్లో సినిమాను ఆస్వాదించవచ్చని దివ్యేందు స్పష్టం చేశారు. పాత్రలు అవే అయినప్పటికీ పరిస్థితులు, సన్నివేశాలు పూర్తిగా కొత్తగా ఉంటాయని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు సిరీస్‌ను ఎంతగా ఆదరించారో అర్థం చేసుకున్న తర్వాతే సినిమాను తెలుగులోకి డబ్ చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
* ఫ్రెష్ కథ.. కొత్త మలుపులు
అలీ ఫజల్ మాట్లాడుతూ ‘మిర్జాపూర్ ది మూవీ’ పూర్తిగా ఫ్రెష్ ఫిల్మ్ అని అన్నారు. పాత్రల స్వభావం, ఎసెన్స్ అలాగే ఉన్నప్పటికీ సన్నివేశాలు కొత్తగా ఉంటాయని, సినిమాలో అనేక కొత్త మలుపులు ఉంటాయని చెప్పారు. గుడ్డు, బీనా, బబ్లు వంటి పాత్రలను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే అభిమానించారని, సినిమాను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
* కొత్త పాత్రలో రవి కిషన్
రవి కిషన్ మాట్లాడుతూ.. తెలుగులో తాను చేసిన సినిమాలకు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇచ్చారని చెప్పారు. ‘మిర్జాపూర్ ది మూవీ’లో బబ్బన్ యాదవ్ అనే కొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ పాత్ర సిరీస్‌లో లేదని, సినిమాలోనే కొత్తగా పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఓటీటీ సిరీస్ బిగ్ స్క్రీన్‌పైకి రావడం ఇదే తొలిసారి అని, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.
* తెలుగులోకి రావడం ప్రత్యేకం
జితేంద్ర కుమార్ మాట్లాడుతూ ‘మిర్జాపూర్’ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారని, ఇప్పుడు అదే కథా ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్‌పై, తెలుగులో చూడటం తనకు ప్రత్యేకంగా ఉందన్నారు. గతంలో ‘పంచాయత్’, ‘కోట ఫ్యాక్టరీ’ సిరీస్‌లకు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని గుర్తుచేసుకున్నారు.
* తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా డబ్ చేశాం
దర్శకుడు గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు సినిమాలను థియేటర్లలో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారని అన్నారు. ‘మిర్జాపూర్’కు తెలుగులో భారీ ఫ్యాన్ బేస్ ఉందని, అందుకే ఈ సినిమాను ప్రత్యేకంగా తెలుగులోకి డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. వెబ్ సిరీస్‌కు వచ్చిన స్పందనలాగే బిగ్ స్క్రీన్‌పై కూడా ప్రేక్షకులు సినిమాను సెలబ్రేట్ చేసుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు.
* మహిళా పాత్రలకు మంచి స్పందన
రసిక దుగల్ మాట్లాడుతూ సిరీస్‌లో తాను చేసిన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభించాయని తెలిపారు. అలాంటి ఆసక్తికరమైన పాత్రలు చాలా అరుదుగా వస్తాయని, సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.
* తెలుగు ప్రేక్షకుల ప్రేమ ప్రత్యేకం
సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ తాను ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించానని, తెలుగు ప్రేక్షకుల నుంచి లభించిన ప్రేమ, అనుభవం ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ‘మిర్జాపూర్ ది మూవీ’తో హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమాలను, నటీనటులను ఎంతగానో అభిమానిస్తారని, ఈ సినిమాకు కూడా అదే ప్రేమ లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
శ్వేతా త్రిపాఠి మాట్లాడుతూ ‘మిర్జాపూర్’ సిరీస్‌కు తెలుగు ప్రేక్షకులు అందించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు సినిమాను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
హర్షిత గౌర్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు కొత్త నటీనటులను ఎప్పుడూ ప్రోత్సహిస్తారని అన్నారు. తాను గతంలో నటించిన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకు కూడా మంచి ఆదరణ లభించిందని గుర్తుచేసుకున్నారు. సెప్టెంబర్ 4న ‘మిర్జాపూర్ ది మూవీ’ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.
‘మిర్జాపూర్ ది మూవీ’లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, జితేంద్ర కుమార్, రవి కిషన్, అభిషేక్ బి, రసిక దుగల్, మోహిత్ మాలిక్, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్, ప్రమోద్ పాఠక్, శ్రియా పిల్గావ్కర్, హర్షిత్ శేఖర్, శ్వేతా త్రిపాఠి, సోనాల్ చౌహాన్, అనంగ్షా బిస్వాస్, షాజీ చౌదరి, సతేంద్ర సోని, కులభూషణ్ ఖర్బందా, సుశాంత్ సింగ్ తదితరులు నటించారు.
దర్శకత్వం గుర్మీత్ సింగ్, నిర్మాతలు రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్. రచన పునీత్ కృష్ణ. సినిమాటోగ్రఫీ సంజయ్ కపూర్ ISC, ఎడిటింగ్ మనన్ అశ్విన్ మెహతా.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
