* ఆదివాసీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి
ఆకేరు న్యూస్ , న్యూ ఢిల్లీ : తెలంగాణలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి సీతక్క కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. సోమవారం ఆమె న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రిని కలిశారు. రాష్ట్రంలోని వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.
ఇప్పటివరకు కనీస రహదారుల సౌకర్యం లేని 1270 ఆవాసాలకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ( PMGSY ) ద్వరా నిధులు మంజూరి చేయాలి. అదే విదంగా రోడ్డు మార్గం లేని 164కు పైగా ఆదివాసి గిరిజన గూడెంలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఆదివాసి, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతులు ఇచ్చే విదంగా చొరవ చూపాలని కోరారు .ఆదివాసి ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించారు.
——————————-