* భారీ వర్షాలకు చైనా అతలాకుతలం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చైనా (China) అతలాకుతలం అవుతోంది. నాలుగు రోజులుగా అక్కడ అక్కడ కుంభవృష్టి కురుస్తున్నది. ఆగ్నేయ ప్రాంతంలో కురుస్తున్న ఈ భారీ వర్షాలకు జనజీవనం విలవిల్లాడుతోంది. హునాన్ ప్రావిన్స్ (Hunan Province) లోని హెంగ్యాంగ్ నగర (Hengyang City) పరిధిలోగల యూలిన్ గ్రామం (Yulin village) లో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ ఇంట్లోని 18 మంది కొండచరియల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్స్ (Rescue teams) హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. కొండ చరియలు తొలగించి తీవ్ర గాయాలతో ఉన్న ఆరుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అలాగే.. భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి షాంఘై నగరం (Shanghai city) లో ఓ భారీ చెట్టు నేలకూలింది. ఈ ఘటనలో ఓ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పలుచోట్ల కాలువల్లో గల్లంతై, కరెంటు షాక్ కొట్టి పలువురు మరణించారు.
———————