* రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
* రైతులు దళారులను నమ్మొద్దు
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరున్యూస్, స్టేషన్ ఘనపూర్ : చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వరి ధాన్యం తర్వాత అత్యధికంగా పండిరచే పంట పత్తి అన్నారు. పత్తికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించాలని రైతులు ఎక్కడ నష్టపోకూడదనే ఆలోచనతో సీసీఐ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఒకటి ఘనపూర్లో, మరొకటి రాజవరంలో ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ ఏడాది పత్తికి 5,700ల రూపాయల మద్దతు ధర ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తేమ పేరుతో రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రైతులు అన్ని నిబంధనను పాటించి కొనుగోలు కేంద్రాలకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. మూడు నెలల వరకు పత్తి కొనుగోలు కేంద్రం అందుబాటులో ఉంటుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రం గురించి ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………………………