* నూతన ఒరవడికి నాంది పలికిన ప్రజా ప్రభుత్వానికి విద్యార్థుల క్షీరాభిషేకం
* శిధిలావస్థకు చేరిన భవన నూతన నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షిరాభిషేకం చేసిన విద్యార్థులు
ఆకేరున్యూస్, వరంగల్: నూతన ఒరవడికి నాంది పలికిన ప్రజా ప్రభుత్వాన్ని విద్యార్థులు అభినందిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన హనుమకొండ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.28కోట్ల నిధులు కేటాయించింది. దీనికి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలిటెక్నీక్ కళాశాల విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు. శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ రంగంపేటలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఫ్రెషర్స్ డే సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల తరువాత విద్యార్థుల జీవితానికి కాలేజ్ చదువు కీలకదశ అని, ఓర్పుతో కూడిన క్రమశిక్షణ అవలంభించుకుని ఉన్నత శిఖరాలను చేరాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. హనుమకొండ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్న చాలామంది ఈ రోజు ఉన్నత బాధ్యతల్లో ఉన్నారని.. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాలేజ్ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
