*ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
సర్వమతాలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవస్తుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో బుధవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి పిలుపునిచ్చారు. భారతదేశ సంస్కృతిలో భాగంగా బిన్నత్వంలో ఏకత్వంగా కలసి ఉంటున్నామని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పదాలు అందరికీ సమంగా అంది ఎందుకు కృషి చేస్తానన్నారు. ఖబరస్తాన్ అభివృద్ది కృషి చేస్తాను. సొంత ఇండ్లు లేని ముస్లిం మైనార్టీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తా అన్నారు.
చదువు ప్రతీ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని అందుకే ఎన్ని కష్టాలు వచ్చిన మీ పిల్లల్ని బాగా చదివించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 240 మైనారిటీ పాఠశాలలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆర్డీవో వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, చిల్పూరుగుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, తిరుమలనాథ దేవస్థానం చైర్మన్ నీల నరసింహులు, జిల్లా మైనారిటీ అధికారి విక్రమ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మ, మాషూక్ అలి, అంజాద్ పాషా, యాకుపాషా, యునెస్, అరాఫత్, సలీం, కౌన్సిలర్లు, జఫర్గడ్, చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.
