– సింగరేణి బొగ్గు అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయంలో కేసీఆర్ పై దాడులు కక్షపూరితం
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్,హుజురాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట, కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం ఎక్స్ వేదికగా తెలిపారు. కేసీఆర్ పై రాజకీయ కక్షపూరిత దాడులు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని,కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను దాచి, ప్రజలను సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం అని,కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు. స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి, దశాబ్దకాలం పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన మహానేత కేసీఆర్ గారిపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, సింగరేణి బొగ్గు అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయంలో, కేసీఆర్ గారిపై దాడులు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ రాజకీయ కక్షపూరిత ధోరణిని స్పష్టం చేస్తోంది. ఇలాంటి చర్యలతో ప్రజలను మభ్యపెట్టవచ్చని భావించడం ప్రభుత్వ అహంకారానికి, రాజకీయ అవివేకానికి నిదర్శనం. కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని, వారి చారిత్రక పాత్రను ఇలాంటి ప్రయత్నాలతో మలినం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఇలాంటి రాజకీయ కక్షపూరిత చర్యలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అని కౌశిక్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా కరీంనగర్ జిల్లా వీణవంక సమ్మక్క సారక్క జాతరలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం హద్దులు మీరుతున్నదని పేర్కొన్నారు.ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అకారణంగా నిర్బంధించడం, వారి కుటుంబసభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం రాష్ట్రంలో సాగుతున్న అరాచక, నిర్బంధ పాలనకు నిదర్శనం అని ఆరోపించారు. మా ఎమ్మెల్యే మీద పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు సామాజిక వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు.
…………………………………………………………………
