* రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజయ్
ఆకేరు న్యూస్, కరీంనగర్ : బీఆర్ ఎస్ పార్టీకీ మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు సార్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. ఆదివారం రాత్రి తన నివాసంలో సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇంకా కొంత మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వరుసలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నట్టు సమాచారం . మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతున్నడంటూ ప్రచారం జరిగింది. తాను పార్టీ మారడం లేదంటూ స్పష్టం చేశారు.
———————–
Related Stories
September 11, 2024
September 11, 2024