
టీజీపీఎస్సీ బీజేవైయం కార్యకర్తల ఆందోళన
* బీజేవైయం కార్యకర్తల ఆందోళన
* జాబ్ కేలండర్ విడుదల చేయాలని డిమాండ్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: హైదరాబాద్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ఉధ్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. బీజేవైయం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ఆరు నెలలు అవుతున్నా నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. బీజేవైయం పిలుపు మేరకు భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు కార్యాలయం ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు. కార్యాలయంలోకి దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు.పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. బీజేవైయం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి జాబ్ కేలండర్ను విడుదల చేయాలి. 25 వేల మంది టీచర్ నియామకాల కోసం మెగా డీఎస్సీ నిర్వహించాలి. గ్రూప్ వన్ పరీక్షకు సంబందించి 1: 50 కి బదులు 1: 100 అభ్యర్థులను పిలవాలని బీజే వైయం నేతలు డిమాండ్ చేశారు.
————————————————-