ఆకేరున్యూస్, న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తనపై నమోదయిన మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు ఢిల్లీ హైకోర్టు లో వాదనలు జరిగాయి. ఎక్సైజ్ పాలసీ కేసులో కవిత అరెస్టు వివరాలపై ఈడీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. అనంతరం ఈ నెల 24న సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇప్పటికే సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా మనీలాండరింగ్ కేసులో మార్చి 15న కవిత అరెస్టయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.
———————–