
ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్ హైదరాబాద్ : తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపధ్యంలో ఎమ్మెల్సీ కవిత శాసనమండలి చైర్మన్ ను కలిసి తీన్మార్ మల్లన్న పై చర్యతీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.తీన్మార్ మల్లన్న నిన్న జహీరాబాద్ లో కవితపై చేసిన వ్యాఖ్యల నేపధ్యంలోనే మల్లన్న కార్యాలయంపై దాడులు జరిగాయి. బీసీల ఉద్యమానికి బీసీల రిజర్వేషన్లకు కవితకు ఏం సంబందం అంటూ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే విధంగా పని చేస్తోందని తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ నేపధ్యంలోనే మొన్న జరిగిన క్యాబెనెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించారని మల్లన్న అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల కోటాకు పెంచేందుకే ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్సును తీసుకొస్తోందని మల్లన్న అన్నారు. బీసీలకు మేలు జరుగుతుంటే కవితకు ఎందుకు సంతోషం అంటూ మల్లన్న ప్రశ్నించారు..బీసీల పేరుతో కవిత లబ్ధిపొందే రాజకీయాలు చేస్తోందని కవితపై మల్లన్న విరుచుకుపడిన విషయం తెల్సిందే..ఈ నేపధ్యంలోనే తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలను కవిత చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడని తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ ను కలిసి కవిత ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.ఈ మేరకు ఆదివారం సాయంత్రం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఆయనకు తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
…………………………………………….