* తీహార్ జైలులో అస్వస్థత..
ఆకేరు న్యూస్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakunta Kavitha) అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ స్కాం(Liquor Scam)లో కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె.. అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ (Delhi Aims)ఆసుపత్రికి తరలించారు. కాగా, కవిత ఆరోగ్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, నెల క్రితం కూడా ఆమె తీవ్రస్వస్థకు గురయ్యారు. జులై 16న ఆమె జైలులోని అస్వస్థతకు గురి కాగా.. ఆమెను దీన్‌దయాళ్ అసుపత్రికి తరలించారు. అప్పడు తీవ్ర జ్వరం, గొంతునొప్పుతో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలు నిర్వహించారు. అనంతరం డిశ్చార్జ్ చేయగా.. తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(HarishRao) రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది.
——————————————–