* ఆరోగ్యం కుదుటపడ్డాక విచారణ చేయాలని వినతి
* సహకరించాలన్న పోలీసులు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : జర్నలిస్టుపై దాడి నేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు(ACTOR MOHANBABU)పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన మోహన్‌బాబు తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్(X) వేదికగా పోస్టు పెట్టారు. ‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. నేను ఎక్కడికీ పారిపోలేదు. ప్రస్తుతం ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంతోంది. తాజాగా ఆయన పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. పోలీసులకు అందుబాటులోకి వచ్చారు. ఆరోగ్యం కుదుటపడ్డాక విచారణ చేయాలని మోహన్‌బాబు పోలీసులను కోరినట్లు సమాచారం. ససేమిరా అన్న పోలీసులు విచారణకు సహకరించాలని కోరడంతో విచారణ(ENQUIRY) కొనసాగుతోంది.
………………………………………….