
అయ్యో.. కవల పిల్లలను చంపేసి..
* కుటుంబ కలహాలతో ఘోరం
* హైదరాబాద్‌లో తీవ్ర విషాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఆ తల్లి కూడా బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మారావు నగర్ ఫేస్ -1 లో విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన సాయిలక్ష్మీ (27)కి అనిల్ కుమార్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత పద్మారావు నగర్ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు పుట్టారు. వారి పేర్లు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి గా పెట్టుకున్నారు. ఆ పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తేవి. చేతన్‌కు మాటలు రాకపోవడంతో కొంతకాలంగా స్పీచ్‌థెరపీ ఇప్పిస్తున్నారు. పిల్లల విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గొడవ జరగడంతో సాయిలక్ష్మి మనస్తాపం చెందింది. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేసింది. అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………..