* రేవంత్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు
* ఇదే నా చివరి ప్రెస్మీట్ : మోత్కుపల్లి నర్సింహులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాదిగలకు అన్యాయం జరుగుతోందంటూ మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాకుండా సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను చాలా మంది సీఎంలతో పనిచేశానని, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. కనీసం ఒక్క టికెట్ అయినా మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేను చస్తేనే మాదిగలకు టికెట్ ఇస్తారా.. అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని కలుద్దాం అంటే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇదే నా చివరి ప్రెస్ మీట్ అంటూ మోత్కుపల్లి కంటతడి పెట్టారు.
———————————————-