ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్లో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉగ్రవాదుల కదలికల ప్రచారంతో వరంగల్లో తీవ్ర కలకలం రేగుతోంది. వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా.. జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. కాగా, కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నిందితుడు జక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు.. అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
