* ఫిబ్రవరి 3న నోటిఫికేషన్.. 27న ఎన్నికలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఫలితాలు వెల్లడిరచనున్నారు. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్`నిజామాబాద్, ఆదిలాబాద్ ` కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ `నిజామాబాద్ ` ఆదిలాబాద్ ` కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఈ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మెదక్ `నిజామాబాద్` ఆదిలాబాద్ ` కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతం జీవన్ రెడ్డి(కాంగ్రెస్) కొనసాగుతున్నారు. మెదక్ ` నిజామాబాద్ ` ఆదిలాబాద్ ` కరీంనగర్ టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తం రెడ్డి, వరంగల్ ` ఖమ్మం ` నల్లగొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సి రెడ్డి కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది. నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 3న వెలుబనుండగా, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 13 వరకు ఉంటుంది. పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగుతాయి. ఓట్లను మార్చి 3న లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
