
* అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న యూ ట్యూబర్ బీస్ట్
* దాతృత్వంలోనూ ముందున్న బీస్ట్
ఆకేరు న్యూస్ ః క్రియేటివిటీ,కొత్తగా ఆలోచించే తత్వం దాన్ని కొత్తగా ఆవిష్కరించే విధానం ..ఇవన్నీ ఉంటే యూ ట్యూబర్లు వెంటనే క్లిక్ అవుతారు.. అత్యధిక సబ్స్క్రైబర్లు సొంతం చేసుకుంటారు..అటోమెటిక్ గా డబ్బులు కూడా దండి సంపాదిస్తారు. అయితే యూ ట్యూబర్లలో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన ఈ అమెరికన్ యూ ట్యూబర్ అసలు పేరు డొనాల్డ్ సన్ .. డొనాల్డ్ సన్ యూ ట్యూబరే కాకుండా మంచి వ్యాపారవేత్త.. ఇతను చేస్తున్న చాలెంజింగ్ వీడియోలతో ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్లు సంపాదించుకున్నాడు. అంతకంటే ఎక్కువగా డబ్బులు కూడా సంపాదించాడు. అయితే మిస్టర బీస్ట్ లో టాలెంట్ ప్రదర్శించడంలోనే కాదు దాన గుణంలో కూడా తానే నెంబర్ వన్ అని నిరూపించుకున్నాడు. యూ ట్యూబ్ ద్వారా తాను సంపాదిస్తున్న డబ్బుతో ఇప్పటి వరకు బీస్ట్ 5 లక్షల బోర్లు తన సొంత ఖర్చుతో వేయించాడు. కోటి మందికి ఆహారాన్నిఉ మిలియన్ విలువైన దుస్తులను దానం చేశాడు. యుద్ధ శరణార్థులకు 30 లక్షల విలువైన ఇంటి సామగ్రిని కొని ఇచ్చాడట..అలాగే దాదాపు మూడు వేల మందికి పైగా కుంటి వారికి కృత్రిమ కాళ్లను అందించాడట. వేల మందికి కంటి ఆపరేషన్లు చేయించాడు.
……………………………………………………….