
* కరకట్ట నిర్మాణ స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
ఆకేరు న్యూస్, ములుగు : గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు వర్షా కాలంలో వరద ముప్పు రాకుండా చూడాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
గురువారం గోదావరి నది పరివాహక ముంపు ప్రాంతాలలో కరకట్ట నిర్మాణ స్థలాలను పరిశీలించారు. ఏటూరునాగారం మండలం రాంనగర్, కోయ గూడెం, రామన్నగూడెం ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. రాంనగర్ ప్రాంతం లో 102 ఎకరాల స్థలాన్ని 6 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణం కోసం 2022 లో నే సర్వే పూర్తి అయింది. మంగపేట మండలంలో పొదమనూర్ ముంపు ప్రాంతాలకు 2.5 కిలోమీటర్ల నూతన కరకట్ట నిర్మాణం కోసం 25 ఎకరాల స్థల సర్వే 2022 లో పూర్తి అయిన వివరాలు సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
అనంతరం కలెక్టర్ ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట గ్రామంలో మిరప తోటలను సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాలానుగుణంగా పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. రైతులకు లాభదాయకమైన పంటలు, నాణ్యమైన విత్తనాల గురించి అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ( రెవిన్యూ) సీహెచ్ మహేందర్ జి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ భాస్కర్, ఎస్ ఈ మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చందర్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి వేణు, జేఈ, ఏఈ, తదితరులు పాల్గొన్నారు.
————————–