* మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్ళింపు
* నగర ప్రజలు సహకరించాలి
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

ఆకేరు న్యూస్ , వరంగల్ : హనుమకొండ నయీంనగర్ పెద్ద మోరీని కూల్చేస్తున్నారు. హనుమకొండ- కరీంనగర్ రహదారి లో వాహనాలను నగరంలోని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. వరంగల్ నగర ప్రజలు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 5న అధికారులు నయీంనగర్ పెద్ద మోరీని కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేశారు. రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మూడు నెలలపాటు నయీం నగర్ రోడ్డు పై రాకపోకలు బంద్ కానున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా ఏప్రిల్ 5 నుంచి మూడు నెలలపాటు ఈ మార్గంలో రాకపోకలు బంద్ కానున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను దారి మళ్లిస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
1. కరీంనగర్ నుండి ఖమ్మం, నర్సంపేట, వరంగల్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు :
కేయూసి జంక్షన్ నుంచి పెగడపల్లిడబ్బాలు, పెద్దమ్మ గడ్డ, ఆటోనగర్, మీదుగా వెళ్ళాలి.
2. కరీంనగర్ నుండి వచ్చే RTC బస్సులు:
కేయూసి జంక్షన్ నుంచి పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు జంక్షన్, అమృత జంక్షన్, హన్మకొండ చౌరస్తా మీదుగా బస్ స్టాండ్ చేరుకోవాలి.
3. ఖమ్మం నుంచి కరీంనగర్ వైపు వెళ్లవలసిన భారీ వాహనాలు :
ఉరుసుగుట్ట, కడిపికొండ, మడికొండ, ఓఆర్ ఆర్ ( ORR ) మీదుగా వెళ్ళాలి.
4. వరంగల్- నర్సంపేట వైపు నుంచి కరీంనగర్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు :
ఎంజీఎం ( ములుగు రోడ్డు జంక్షన్,పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు , కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్ళాలి.
5. హన్మకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్ళు RTC బస్సులు :
హన్మకొండ చౌరస్తా, అమృత జంక్షన్, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లిడబ్బాలు , కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్ళాలి.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
