* మంటల్లో పడ్డ ఇద్దరు చిన్నారులు
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్నాయిగూడెం మండలం కొత్తూరు గ్రామంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెత్తకుప్పలో అంటుకున్న మంటల్లో పడిపోయారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన కుమ్మరి రమేశ్ పిల్లలు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆడుకుంటున్న సమయంలో చెత్తకుప్పలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చిన్నారులు వాటిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. దాదాపు 60 శాతం వరకు కాలిన గాయాలు అయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారులను మంటల నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
