VBG Ram Ji Employment Works
* నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి
* జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్,ములుగు: వి.బి.జి. రామ్ జి ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ( Collector Hemant Sahadeorao) సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ లోని మినీ సమావేశం హాల్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం. సంపత్ రావుతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలతో వి.బి.జి. రామ్ జి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి
మండలాల వారీగా ఉపాధి హామీ పనుల పురోగతి, ఇంకుడు గుంతలు, బోరుబావుల రీఛార్జ్ పాయింట్లు, ఊట చెరువులు, పంట కుంటల నిర్మాణం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇంకుడు గుంతలు, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు, ఊట చెరువులు, పంట కుంటల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని, ప్రతి ఎంపీడీఓ తమ పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఉపాధి హామీ పనుల అమలులో అధికారులు ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లాలోని మండలాల ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

