Shankar Goud Son Job
* ఆర్టీసీలో నియామక పత్రం
* మంత్రి పొన్నం చేతుల మీదుగా అందజేత
ఆకేరు న్యూస్, వరంగల్: నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ మృతి చెందిన కోల శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసింది. ఆయన కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి హేమంత్ గౌడ్‌కు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. హేమంత్ గౌడ్‌ను ఆర్టీసీలో రికార్డ్ ట్రెజరర్‌గా నియమించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు.
* ఆర్టీసీ సమ్మె సమయంలో విషాదం
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేసిన కోల శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, డిమాండ్ల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శంకర్ గౌడ్ మృతితో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా తన వ్యక్తిగతంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగ నియామక పత్రం అందజేయడంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉద్యోగ హామీ అమలైనట్లయింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

