Maoist Damodar returns Mulugu
* మాజీ మావోయిస్టు దామోదర్ స్వగ్రామానికి రాక
* మావోయిస్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దామోదర్
ఆకేరు న్యూస్, ములుగు:
25 సంవత్సరాల కాలం పాటు సాయుధ పోరాటంలో కొనసాగి, ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు బడే చొక్కా రావు (అలియాస్ దామోదర్) ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపల్లి తాను జన్మించిన గ్రామానికి మంగళవారం గ్రామానికి చేరుకున్న ఆయనకు పాత మిత్రులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.
గతంలో పీపుల్స్ వార్ గ్రూప్లో కాల్వపల్లి గ్రామం ఆయన ఉద్యమ ప్రస్థానంలో కీలక భూమిక పోషించింది. 25 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచే ఆయన తన కార్యకలాపాలను ప్రారంభించి, పార్టీలో డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, నాటి సహచరులతో కాసేపు ముచ్చటించారు.
లొంగిపోయిన దామోదర్, జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మొదటిసారి ఈ ప్రాంతానికి రావడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. మొదట తన తల్లి బతుకమ్మను కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తన కుటుంబ సభ్యులు,బంధువులతో స్నేహితులతో కలిసి తనవితీరా మాట్లాడారు. గతంలో తనతో కలిసి ఉద్యమంలో పనిచేసిన వారు ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
