BRS leaders join Congress
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన సుమారు 30 మంది బిఆర్ఎస్ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బొల్లెపాక శ్రీనివాస్, ఇల్లందుల రాజు, బొక్కల మహేష్, బొక్కల ఆహారోన్, గడ్డమీది రమేష్, భూక్య శ్రీనివాస్, చిన్నపెల్లి కుమార్, సుక్క ప్రసాద్, తాళ్లపెల్లి వెంకటేశ్వర్లు, చుక్క రాజు తదితరులు ఉన్నారు. కొత్త పాత అనే తేడా లేకుండా పార్టీ బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డమీది సురేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇల్లందుల విజయ్, రవీందర్ రెడ్డి, నీల రాజు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
