* ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్
ఆకేరు న్యూస్, ములుగు: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుత శీతాకాలంలో వాహనదారులు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్ ప్రకటన లో కోరారు.ఉదయం–రాత్రి సమయంలో తీవ్ర పొగమంచు (ఫాగ్) ఏర్పడుతున్న నేపథ్యంలో వాహనదారులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తల పై సూచనలు విడుదల చేశారు. ఇందులో
1. ఫాగ్ లైట్లు, హెడ్ లైట్లు తప్పనిసరిగా ఆన్‌లోనే ఉంచాలి.
2. వాహనాన్ని నెమ్మదిగా నడపాలి ఓవర్ స్పీడ్ చేయకూడదు.
3.పొగమంచు కారణంగా వాహనాలు కనిపించకపోవచ్చు, ముందు వెళ్తున్న వాహనానికి కనీస సురక్షిత దూరం పాటించాలి.
4. రోడ్డు పక్కనున్న మార్కింగ్ లైన్స్‌ను దాటకుండా నడపాలి.
5.ఇతరు వాహనదారులను అప్రమత్తం చేయడానికి హరేన్ ను ఉపయోగించాలి.
6.మూల మలుపుల వద్ద ముందస్తుగానే ఇండికేటర్స్ ను వాడాలి.
7. ఎక్కువ పొగమంచు ఉన్నప్పుడు హై బీమ్ ఉపయోగించవద్దు, అది ఎదురు వచ్చే వారికి విజిబిలిటీ తగ్గిస్తుంది.
8. టైర్లు, బ్రేకులు, వైపర్లు ముందుగానే చెక్ చేసుకోవాలి.
9. అవసరం లేకుండా రోడ్డు పక్కన వాహనాలు ఆపవద్దు. ఆపాల్సి వస్తే హెజర్డ్ లైట్లు ఆన్ చేయాలి.
10. డ్రైవర్లు పూర్తిగా అప్రమంత్తముగా ఉండాలి. నిద్రలేమీతో గాని తాగిన మత్తులో గానీ డ్రైవింగ్ చేయవద్దు.
11. ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు హైవేలపై వాకింగ్ చేయరాదు నిర్ణత మైదానలలో మాత్రమే వ్యాయామం చేసుకోవాలి. వింటర్ ఫాగ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉదయం 5 నుండి 8 గంటల మధ్య, రాత్రి 8 తర్వాత ప్రయాణాలు వద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయాలని, కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి పౌరుడి ప్రాణ భద్రత మా ప్రాధాన్యత. పొగమంచు సమయంలో విజిబిలిటీ తగ్గడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి వాహనదారుడు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 112 నంబర్‌కు వెంటనే ఫిర్యాదు చేయగలరని ఎస్ పి తెలియచేశారు.
…………………………………………………

