* జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాద్ కేకాన్
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లా వ్యాప్తంగా మైనర్ పిల్లలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మురుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ తెలిపారు. ములుగు జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం (Fast Track POCSO Court) లో శుక్రవారం జరిగిన విచారణలో న్యాయస్థానం అత్యంత కీలక తీర్పును ప్రకటించారు. 2020లో ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 44/2020 కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన శిక్ష విధించబడిందన్నారు. జిల్లాలోని బండారుపల్లి గ్రామానికి చెందిన కొండ బోయిన మహేందర్ RTC బస్ కండక్టర్ ఫిర్యాదు మేరకు ఇదే గ్రామానికి చెందిన ఎల్పుల రవి తేజ ఆటో డ్రైవర్ పోక్సో కేసులో దోషిగా తెలినందున న్యాయమూర్తి S.V.P. సూర్య చంద్రకళ నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 6,000/- జరిమానా విధిస్తూ U/S 235(2) CrPC ప్రకారం తీర్పు ప్రకటించారని ఆయన తెలిపారు. మైనర్ పిల్లలపై నేరాలకు పాల్పడితే ఊపేక్షించేదిలేదని బాదితులకు న్యాయం కల్పించడానికి పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,ఇలాంటి నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
…………………………………….

