ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో రెండవ విడత విడత పంచాయతీ ఎన్నికలలో 81.53% పోలింగ్ జరిగింది. ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపుర్, జెడి మల్లంపల్లి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో జెడి మల్లంపల్లిలో 10883 ఓట్లకు గాను 9196 పోలింగ్ జరిగింది, ములుగు మండలంలో 20,470 కోట్లకు గాను 16,132 ఓటు హక్కును వినియోగించుకున్నారు.వెంకటాపురం మండలంలో 23,591 ఓట్లకు గాను 19466 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో జిల్లా వ్యాప్తంగా 54,944 ఓట్లకు గాను 44 794 కోట్లు నమోదు కాగా 81.53%శాతం ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో రెండవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా యంత్రాంగం రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు.

…………………………………………..
