ఆకేరు న్యూస్,ములుగు: తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ పేరుతో జరుగుతున్న రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా ములుగు జిల్లా,గోవిందరావుపేట మండలo భగ్గుమంది. ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ములుగు జిల్లా ఇంచార్జ్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు ఆదివారం బి ఆర్ ఎస్ గోవిందరావు పేట మండల కమిటీ అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు గోవిందరావుపేట మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.సందర్భంగా లకావత్ నరసింహ నాయక్ మాట్లాడుతూ పాలన చేతకాని ఈ రేవంత్ రెడ్డి తెలంగాణను సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన మహానాయకుడు కేసీఆర్ పై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనన్నారు. కేసీఆర్ పై సిట్ విచారణ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఫోన్ ట్యాపింగ్” అనే ఒక కేసును అడ్డుపెట్టుకుని, ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తూ,కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణ పేరుతో చేస్తున్న ఈ రాజకీయ కక్షసాధింపు చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు . కేసీఆర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని, తెలంగాణ అగ్నిగుండమై రగులుతుందని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తిరగబడి, కాంగ్రెస్ సర్కారును బొంద పెట్టడం ఖాయమని , కేసీఆర్ ,కెటిఆర్, హరీష్ రావులపై రాజకీయ వేధింపులను బీఆర్ఎస్ సైన్యం తిప్పికొడుతుందని, అన్నారు.ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం.తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని, జై తెలంగాణ జై కెసిఆర్ అని నినాదాలు చేశారు .ఈ కార్యక్రమంలో అక్కినేపల్లి రమేష్ హేమాద్రి ,సీనియర్ నాయకులు, లకావత్ చందులాల్,పృథ్వి రాజ్, పోరిక కిరణ్ కుమార్,హనుమంతరావు. కంపాటి కృష్ణ రావు. సూరనేని రవీందర్రావు,బానోత్ సీతారాం, అంబటి వినయ్, ధరావత్ రాకేష్, సమ్మక్క స్వప్న ,కంపాటి కృష్ణ రావు,కందాల ఇంద్రారెడ్డి. భగవాన్ రెడ్డి. ఫక్రుద్దీన్, బూరెటి మధు, పూర్ణచందర్ బండి రాజశేఖర్, కొమురయ్య వార్డ్ నెంబర్, కత్తుల సారయ్య, శ్రీను, ఉట్ల మోహన్ గుమ్మడి ప్రసాద్ , రసపుత్ హనుమంతు, గూడూరు శ్రీనివాస్, మడికొండ రమేష్, పోరిక స్వామి, చుక్క గట్టయ్య,గజ్జి ఎలేందర్ ,పులుసం సాంబారావు, బానోత్ మత్తయ్య నాయక్, బైకని ఓదెలు, దర్శనాల సంజీవ, సామ రామిరెడ్డి, కుమ్మరి వెంకన్న, గోద కనకయ్య, బొల్లం ప్రసాద్, భగవాన్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
…………………………………………………..
