* తొర్రూర్ మునిసిపల్ చైర్మన్ తూణంశ్రవణ్
* జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ గా బాలామణి
* బీఆర్ ఎస నిరసనల మద్య ఎంపిక
ఆకేరు న్యూస్ , వరంగల్ : ఎట్టకేలకు తొర్రూర్, జనగామ మునిసిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. సోమవారం వాయిదాపడిన ఈ ఎన్నిక మంగళవారం లక్కీ డ్రా ద్వారా ప్రకటించారు. ఈ రెండు మునిసిపాలిటీలు సైతం కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థులకు అవకాశం దక్కింది. బీఆర్ ఎస్ నేతల నిరసనల మద్య అధికారులు విజేతలను ప్రకటించారు. తొర్రూర్ మునిసిపాలిటీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 16 కాగా ఇందులో బీఆర్ ఎస్ 9 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు గెలుచుకున్నది. దీంతో ఎక్స్ అఫిసియో ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కింది. జనగామ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ల ఎక్స్ అఫిషియో ఓట్లతో సమానమయ్యారు. దీంతో లక్కీ డ్రా ద్వారా చైర్మన్ ఎంపికను చేపట్టారు. లక్కీ డ్రాలో తొర్రూర్ మునిసిపాలిటీ రెండవ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తూణం శ్రవణ్ చైర్మన్ గా ఎంపికయినట్లు అధికారులు ప్రకటించారు. వైస్ చైర్మన్ గా సోమ రజనీ ఎంపికయ్యారు.
* జనగామ పీఠం కాంగ్రెస్ దే..
జనగామ మునిసిపాలిటీ ఎంపిక హైడ్రామాల మద్య మంగళవారం ముగిసింది. జనగామ మునిసిపాలిటీలో వార్డుల సంఖ్య 30. కాగా ఇందులో బీఆర్ ఎస్ 13 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో విజయం సాధించింది. సీపీఎం 1 స్థానంలో గెలిచింది. నలుగురు ఇండిపెండెట్లు కూడా గెలిచారు. ఈ నలుగురిలో ఇద్దరు బీఆర్ ఎస్ వైపు, మరో ఇద్దరు కాంగ్రెస్ వైపు వెళ్ళారు. దీంతో బీఆర్ ఎస్ గెలిచిన 13తో పాటు ఈ ఇద్దరు కలవడంతో 15కు బలం పెరిగింది. అదనంగా ఎక్ అఫిషియో సభ్యుడి హోదాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు కలవడంతో బలం 16 కు పెరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 12 సభ్యులతో పాటు అదనంగా ఇద్దరు ఇండిపెండెంట్లతో పాటు సీపీఎం సభ్యుడు కూడా కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ బలం 15కు చేరుకుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓటుతో కాంగ్రెస్ బలం కూడా 16కు చేరింది.దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలామణి చైర్ పర్సన్‌గా అవకాశం దక్కింది. వైస్ చైర్మన్ గా బీఆర్ ఎస్ అభ్యర్థి పర్వతాలు సైతం లక్కీ డ్రాలో పదవి దక్కించుకున్నారు.
————————–
