CM Revanth Reddy Musarambagh Bridge Inauguration
* నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్
* రూ. 52 కోట్లతో నిర్మాణం
* ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలోని మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు నేడు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. దీంతో నగరంలోని కీలక రాకపోకలకు ఊరట కలుగనుంది. రూ.52 కోట్ల వ్యయంతో సుమారు 400 మీటర్ల పొడవున ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అంబర్పేట్ నుంచి మలక్పేట్ టీవీ టవర్ వైపు ప్రయాణించే వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు కొత్త బ్రిడ్జి ప్రారంభంతో ఊరట లభించనుంది. ముఖ్యంగా నగరంలోని కీలక ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభం హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో మరో కీలక మౌలిక సదుపాయంగా నిలవనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
