ఆకేరు న్యూస్, డెస్క్ : ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో నలుగురు గ్యాంగ్ స్టర్లు మృతి చెందారు. బిహార్‌లోని రంజన్ పాఠక్ ముఠాకు చెందిన నలుగురు హతమయ్యారు. బిహార్ లో పలు హత్యలు, దోపిడీలకు పాల్పడింది రంజన్ పాఠక్ ముఠా. తాజాగా బిహార్ ఎన్నికల్లో ఈ ముఠా భారీ అక్రమాలకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో బిహార్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేసి నిందితులను గుర్తించారు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో ఈ ముఠా హతమైంది. గురువారం తెల్లవారుజామున 2. 20 గంటల సమయంలో పోలీసులకు, నిందితులకు మధ్య కాల్పులు జరిగాయి. బహదూర్ షా మార్గ్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. కాల్పుల అనంతరం నలుగురు నిందితులును రోహిణిలోని డాక్టర్ బీఎస్ఏ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. రంజన్ పాఠక్ (25), బీమ్ లేష్ మహతో (25), మనీష్ పాతక్ (33), అమన్ ఠాకూర్ (21) గా వారిని గుర్తించారు. రంజన్ పాతక్, బీమ్ లేష్ మహతో, మనీష్ పాతక్ బిహార్‌కు చెందిన సీతామర్హి ప్రాంతానికి చెందిన వ్యక్తులు కాగా.. అమన్ ఠాకూర్ స్వస్థలం ఢిల్లీలోని కార్వాల్ నగర్.
……………………………………………..
