పారిశుధ్య మహిళా కార్మికురాలిపై దాడి దృశ్యాలు
* నల్లగొండలో ఇంటి యజమానిపై ఆరోపణలు
ఆకేరు న్యూస్, నల్లగొండ : పట్టణంలోని 45వ వార్డు ప్రకాశం బజార్లో మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై (Nalgonda Woman Worker) ఇంటి యజమాని కర్రతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు జానమ్మ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మహిళా కార్మికురాలని కూడా చూడకుండా కర్రతో దాడి చేయడంపై తోటి పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
* జానమ్మకు న్యాయం చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్
ఈ ఘటనపై బాధితురాలు జానమ్మ నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్లు సమాచారం. మహిళా కార్మికురాలిపై దాడి (Attack on Woman Sanitation Worker) ఘటనపై తోటి కార్మికులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఈ ఘటనపై ఇంటి యజమాని తల్లి, స్థానికులు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు తమను అసభ్య పదజాలంతో దూషించిందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పోలీసులు (Nalgonda Police) సమగ్ర విచారణ జరిపి ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. మహిళా కార్మికురాలిపై (Nalgonda Woman Worker) దాడి జరిగిందన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని తోటి కార్మికులు కోరుతున్నారు.
Read Also : హైదరాబాద్లో టీజీ సేఫ్ తనిఖీలు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

