Namapur Farmers Protest
* నామాపూర్‌లో రైతుల రాస్తారోకో..
* మిల్లర్ల తీరుపై రైతుల ఆగ్రహం
ఆకేరు న్యూస్, రాజన్న సిరిసిల్ల : నామాపూర్ గ్రామంలో రైస్ మిల్లర్ల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి తమ వద్ద తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ నష్టపరుస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట–ముస్తాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
* తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ ఆరోపణ
ధాన్యం పండించేందుకు నెలల తరబడి శ్రమించి, పెట్టుబడులు పెట్టిన తమకు పంట విక్రయించే సమయంలో ఆశించిన ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు పరస్పరం కుమ్మక్కై తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. రైతులకు న్యాయం చేయాలని, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
* ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
రైతుల ఆందోళనతో ఎల్లారెడ్డిపేట–ముస్తాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా సంబంధిత అధికారులు స్పందిస్తారా? మిల్లర్లపై వస్తున్న ఆరోపణలను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తారా? అన్నది వేచి చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

