Accident in Rajasthan
* బస్సు-ఆటో ఢీకొని ముగ్గురు మృతి
* భీన్మాల్–రామ్సీన్ ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం
* నుజ్జునుజ్జయిన ఆటో.. స్థానికుల సహాయక చర్యలు
ఆకేరు న్యూస్, జాలౌర్ : రాజస్థాన్లోని జాలౌర్ జిల్లా భీన్మాల్–రామ్సీన్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ రోడ్వేస్ బస్సు, ప్రయాణికుల ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఢీకొన్న తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయి బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయింది.
* ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి..
ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో సమీపంలోని గ్రామస్తులు, బాటసారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సహాయంతో ఆటోలో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీసి భీన్మాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
* దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించిన పోలీసులు.. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

