ఆకేరు న్యూస్, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి క్రోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. మళ్లీ విచారణను ఈ నెల 23కు కోర్టు వాయిదా వేసింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. ఇవాళ రెండో సాక్షి స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది. ఇప్పటికే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ తన కుటంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నాగార్జున పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.
…………………………..