ఆకేరు న్యూస్, హైదరాబాద్: నాంపల్లి ప్రత్యేక కోర్టులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై కేటీఆర్ తరపు న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యానించారని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొనగా.. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను కేటీఆర్ సాక్షులుగా పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ తన పట్ల చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండిరచిన సంగతి తెలిసిందే. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడరని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, కేవలం తన గౌరవానికి, ఇమేజ్‌కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
