
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ‘మహాయుతి కూటమి’కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (NARENDRA MODI) అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు. ఐక్యంగా మరిన్న విజయతీరాలను సాధించాలని అభిలాషించారు. ‘ఇది అభివృద్ధి విజయం. సుపరిపాలన సాధించిన గెలుపు. సమష్టిగా ఉంటే మనం మరింత ఎత్తుకు ఎదుగుతాం. ఎన్డీయేకు ఇంత చారిత్రిక విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
………………………………………