ఆకేరు న్యూస్ డెస్క్ : 1969లో తుంబా నుంచి చిన్నచిన్న సౌండింగ్ రాకెట్లతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో (Isro)తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగంతో నిర్ణయాత్మక దశకు చేరింది. అక్కడినుంచి చంద్రయాన్-3 ప్రయోగ విజయం వరకూ ఎన్నో మార్లు దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది. ఇస్రో చరిత్రలో గొప్ప మైలురాయి చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడమే కాకుండా గత ఏడాది ఆగస్టు 23న చంద్రయాన్-3లో పంపిన ప్రజ్ఞాన్, రోవర్ చంద్రుడిపై సేఫ్గా ల్యాండ్ కావడంతో దేశంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ రోజును భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని(National Space Day) జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(Prime minister Modi) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగానికి చెందిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాలను తమ ప్రభుత్వ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో తెలిపారు. అంతరిక్ష శాస్త్రవేత్తలు (Space scientists)చేస్తున్న ప్రయత్నాలను తన ఎక్స్ అకౌంట్లో మోదీ కొనియాడారు.
————————————-