
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆశాలు అంగన్వాడీ యూనియన్ భవనిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను అమలు చేస్తున్నదని ఆరోపించారు.కార్మిక వర్గం పోరాటాల తో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లను తెచ్చిందని. ఈ ఏడాది మే 30 వ తారీఖున జీవో నెంబర్ 49 ని తీసుకువచ్చింది న్నారు .ఆదివాసి హక్కులను కాలరాస్తున్నదని ఆదివాసులను వారి గ్రామాల నుండి గెంటివేసే ప్రయత్నం చేస్తున్నది నూతన అటవీక్షణ చట్టం సవరణతో గ్రామసభ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని, భవన నిర్మాణం కార్మికులకు,ప్రైవేట్ రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ,వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంచాలని,విద్యుత్ ప్రవేటీకరణను ఆపాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి 200 రోజులు పనిని కల్పించి రోజుకు 600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు,ఆశా అంగన్వాడీ కార్యకర్తలు భవనిర్మాణ కార్మికులు, గ్రామపంచాయతీ వర్కర్లు, హమాలీలు ఆటో యూనియన్ గిరిజన సంఘం నాయకులు అలెం అశోక్, ఊకె ప్రభాకర్, దాసరి కృష్ణ అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క, సరోజన, రుక్మిణి, సరిత, రేణుక, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు బండారి బుజ్జి బాబు, పురుషోత్తం రాజు, , ఆశా వర్కర్ యూనియన్ నాయకులు మంకిడి రమ, పాలకుర్తి రోజా రాణి, అనిత కొంకటి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చిట్టినేని శ్రీను, కాట నర్సింగరావు, ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………