* కొత్త ప్రభుత్వంలో కొత్త సీఎస్
ఆకేరు న్యూస్, విజయవాడ : అధికారం చేపట్టకముందే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యంత్రాంగంలో ప్రక్షాళన మొదలైంది. మొన్న సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో (Jawahar Readdy) ఆయన సమావేశం అయ్యారు. అనంతరం జవహర్ రెడ్డి సెలవులతో వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈనెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) ను నియమిస్తూ ఈ ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్ ప్రస్తుతం పర్యావరణ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన బుధవారమే చంద్రబాబును కలిసినట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
—————-