NEET UG 2026 EXAM CANCELLED
* లక్షల మంది విద్యార్థులకు షాక్
* సీబీఐ విచారణకు ఆదేశం
ఆకేరు న్యూస్, డెస్క్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ (NEET UG) 2026 పరీక్షపై కేంద్ర ప్రభుత్వం మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల (మే) 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
* రద్దుకు ప్రధాన కారణం…
రాజస్థాన్ రాష్ట్రంలో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన ఎన్టీఏ, పరీక్ష పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తడంతో పరీక్షను రద్దు చేయడమే సరైనదని భావించింది. సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
* సీబీఐ విచారణకు ఆదేశం
పేపర్ లీక్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించింది. ఈ కుట్రలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించబోమని కేంద్రం స్పష్టం చేసింది.
* పరీక్ష మళ్లి ఆ రోజే….
రద్దు చేసిన పరీక్షను మళ్ళీ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. దీనికి సంబంధించిన కొత్త తేదీలను (Fresh Dates) అతి త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తామని తెలిపింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు, ఇతర వివరాల కోసం ఎన్టీఏ వెబ్సైట్ను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించింది.
విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ప్రతిభావంతులకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
