* హర్యానాలో జరిగిన బస్సు ప్రమాదంలో 9 మంది దుర్మరణం
* తీర్థయాత్ర ముగించుకుని వస్తుండగా దుర్ఘటన
* మృతులంతా ఒకే కుటుంబీకులు
ఆకేరు న్యూస్ డెస్క్ : తీర్థయాత్రలకు బయలుదేరిన ఓ పెద్ద కుటుంబం తిరిగి వచ్చేటప్పుడు తీవ్రమైన విషాదాన్ని మూటగట్టుకుంది. యాత్రా విశేషాలను చెప్పుకుంటూ, ఫోన్లలో ఫొటోలను చూసుకుంటూ మురిసిపోయి.. ఆదమరచి నిద్రపోయిన వారిలో 9 మంది మంటల్లో మాడి మసైపోయారు. మిగిలిన వారు గుండెలవిసేలా బోరుమంటున్నారు. హర్యానాలో ఓ ట్రావెల్ బస్సులో ఉన్నంటుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నుహ్ జిల్లా తావడు పట్టణ సమీపంలోని కుండలీ మానేసర్ వద్దకు రాగానే బస్సు వెనుక నుంచి పొగ వచ్చి నెమ్మదిగా మంటలు చెలరేగాయి. అయితే, ఈ విషయం బస్సులో ఉన్నవారికి చాలా ఆలస్యంగా తెలిసింది. బైక్‌పై ప్రయాణించే ఓ వ్యక్తి ఈ విషయాన్ని గమనించి బస్సు డ్రైవర్‌కు చెప్పాడు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించింది. ఈ ప్రమాదంలో 9మంది ఆ మంటల్లో కాలి బూడిదవ్వగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించామని, అయితే ఇంకా మృతులను గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు.
———————-