Tirumala Srivari Darshan
* సర్వదర్శనానికి 6 గంటలు
ఆకేరు న్యూస్, తిరుమల : శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 72,019 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,431 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి నిన్న రూ.3.5 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
*ఏడో రోజుకు చేరిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఏడో రోజు వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
