ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ సీట్లను ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండానే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రతి ఏడాది మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ప్రవేశపరీక్ష నిర్వహిస్తుండగా.. ఆ విధానాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ అకడమిక్ సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్ష లేకుండా అడ్మిషన్లు స్వీకరించనున్నారు. ఇందులో అడ్మిషన్ల కోసం పదో తరగతిలో వచ్చిన మార్కులు, మెరిట్ ఆధారంగా ఇంటర్లో ప్రవేశం కల్పిస్తారు, ఇంటర్ మార్కులు, మెరిట్ ఆధారంగా డిగ్రీలో అడ్మిషన్లు కల్పిస్తారు. త్వరలో డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
