* కాశీబుగ్గ ఆలయ నిర్వాహకుడు హరిముకుంద
ఆకేరు న్యూస్ డెస్క్: నిన్న శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పది మంది మృతి చెంది పదుల సంఖ్యలో భక్తులు గాయపడిన విషయం తెల్సిందే.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత,తో పాటు ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. ఈ నేపధ్యంలో ఆలయంలో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదని, దుర్ఘటన జరగానికి ఆలయ నిర్వాహకులే కారణమనే విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆలయ నిర్వాహకుడు,ఆలయాన్ని స్వంత ఖర్చుతో నిర్మించిన హరిముకుంద దీనిపై స్పందించారు. ఆలయ ఘటనపై తనను బాధ్యుడను చేస్తున్నారని తనపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కేసులు బనాయించినా భయపడేది లేదని తనను ఆ శ్రీనివాసుడే కాపాడుతాడని పేర్కొన్నాడు. వేంకటేశ్వర స్వామే తనను ఆలయ నిర్మాణానికి పూనుకునేలా చేశాడని తెలిపారు. తనను ఆ వెంకటేశ్వర స్వామే కాపాడుతాడని భావోద్వేగంతో తెలిపారు.
……………………………………………….
