Norway King Harald V
* జీవితం వడ్డించిన విస్తరి కాలేదు
* 567 ఏళ్ల తర్వాత నార్వేలో పుట్టిన యువరాజు హరాల్డ్
* మూడేళ్ల వయసులోనే దేశం వదిలి పారిపోయారు
* ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాజు
* ప్రేమ కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూసిన యువరాజు
* నార్వే రాజు హరాల్డ్ V అనారోగ్యంతో కన్నుమూత
ఆకేరు న్యూస్, డెస్క్ :
నార్వే దేశపు రాజు హరాల్డ్ V శుక్రవారం ఉదయం గం.6:35 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నార్వే రాయల్ ప్యాలెస్ ప్రకారం ఆయన ఓస్లో యూనివర్సిటీ హాస్పిటల్లో ప్రశాంతంగా కన్ను మూసారని ప్రకటించారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. 1991 నుంచి 35 ఏళ్లపాటు రాజుగా ఉన్న హరాల్డ్ మరణంతో కుమారుడు హాకోన్ నార్వే కొత్త రాజయ్యారు. హరాల్డ్ మరణంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మీయత, దేశసేవ పట్ల ఉన్న నిబద్ధత తనను ఎంతో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు.
* 567 ఏళ్ల తర్వాత నార్వేలో పుట్టిన యువరాజు హరాల్డ్
నార్వే స్వతంత్ర రాజవంశం నిరంతరంగా కొనసాగలేదు . డెన్మార్క్, స్వీడన్ రాజులే నార్వే సింహాసనాన్ని కూడా చేపట్టారు . అందువల్ల వారసులు విదేశాల్లో పుట్టేవారు . 1905లో నార్వే మళ్లీ పూర్తిగా స్వతంత్ర రాజ్యమైంది. డెన్మార్క్ యువరాజును రాజుగా ఎన్నుకుంది. ఆయన మనవడు హరాల్డ్ 1937లో నార్వేలో పుట్టాడు.1937 ఫిబ్రవరి 21న నార్వేలోని స్కాగుమ్లో జన్మించారు. తండ్రి క్రౌన్ ప్రిన్స్ ఒలావ్.తల్లి క్రౌన్ ప్రిన్సెస్ మార్థా.హరాల్డ్కు రాగ్న్హిల్డ్, ఆస్ట్రిడ్ అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. అప్పటి నార్వే రాజ్యాంగం ప్రకారం మహిళలకు సింహాసనంపై వారసత్వ హక్కు లేకపోవడంతో హరాల్డ్ జననం రాజకుటుంబానికి అత్యంత కీలకమైంది. ఏకంగా 567 సంవత్సరాల తర్వాత నార్వే గడ్డపై జన్మించిన తొలి యువరాజు హరాల్ద్ .అందుకే ఆయన జననం అప్పట్లో నార్వేలో ఒక జాతీయ వేడుకగా మారింది.

* రాజకుమారుడే… జీవితం వడ్డించిన విస్తరి కాలేదు
రాజకుమారుడిగా పుట్టినంత మాత్రాన హరాల్డ్ బాల్యం సుఖంగా సాగలేదు.1940 ఏప్రిల్ 9న హిట్లర్ అద్వర్యంలోని నాజీ జర్మనీ నార్వేపై దాడి చేసింది.అప్పుడు హరాల్డ్ వయసు కేవలం మూడేళ్లు.జర్మన్ సైన్యానికి చిక్కకుండా రాజకుటుంబం ఓస్లో నుంచి పారిపోవాల్సి వచ్చింది.హరాల్డ్ తన తల్లి, అక్కలతో కలిసి చివరకు అమెరికాకు వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధంలో కొంతకాలం ఆయన బాల్యం అమెరికాలో ప్రవాసంలో గడిచింది.యుద్ధం ముగిసిన తర్వాత 1945లో రాజకుటుంబం తిరిగి నార్వే చేరింది.ఈ అనుభవం హరాల్డ్ వ్యక్తిత్వంపై జీవితాంతం ప్రభావం చూపిందని ఆయన జీవితాన్ని పరిశీలించిన వారు పేర్కొంటారు.హరాల్డ్ విద్యాభ్యాసంలో కూడా నార్వే రాజకుటుంబం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.సాధారణ పిల్లలతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తొలి నార్వే రాజకుటుంబ సభ్యుడిగా ఆయన గుర్తింపు పొందారు. తర్వాత నార్వేజియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందారు.అనంతరం బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.బల్లోయిల్ కాలేజీ ( Balliol College)లో సామాజిక శాస్త్రాలు, చరిత్ర, ఆర్థికశాస్త్రం వంటి అంశాలను అభ్యసించారు.అంటే రాజుగా మారడానికి ముందు సైనిక శిక్షణతో పాటు ఆధునిక విశ్వవిద్యాలయ విద్య కూడా అభ్యసించారు.
* ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాజు
హరాల్డ్కు మరో అసాధారణ గుర్తింపు ఉంది. ఆయన అద్భుతమైన నావికుడు. Sailing అంటే విపరీతమైన ఆసక్తి. నార్వే తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.1964 టోక్యో ఒలింపిక్స్‌లో నార్వే జాతీయ జెండాను మోసిన వ్యక్తి కూడా హరాల్డే. 1964 టోక్యో, 1968 మెక్సికో సిటీ, 1972 మ్యూనిక్, మూడు ఒలింపిక్ క్రీడల్లో సెయిలింగ్ ( Sailing )లో నార్వేకు ప్రాతినిధ్యం వహించారు.ఒక దేశానికి భవిష్యత్ రాజు ఒలింపిక్ అథ్లెట్ కావడం హరాల్డ్ జీవితంలోని అత్యంత ఆసక్తికర అంశాల్లో ఒకటి.
* ప్రేమ కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూసిన యువరాజు
హరాల్డ్ జీవితంలోని అత్యంత రొమాంటిక్ అధ్యాయం సోన్యా హరాల్డ్సెన్.ఆమె రాజకుటుంబానికి చెందిన మహిళ కాదు.ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువతి.హరాల్డ్ ఆమెతో ప్రేమలో పడ్డారు.కానీ భవిష్యత్ రాజు ఒక సామాన్య యువతిని వివాహం చేసుకోవడం అప్పటి రాజకుటుంబ సంప్రదాయాలకు విరుద్ధం.దీంతో వారి వివాహానికి సంవత్సరాలపాటు అనుమతి లభించలేదు.దాదాపు తొమ్మిదేళ్లు ఇద్దరూ ఎదురుచూశారు.చివరకు హరాల్డ్ తన తండ్రి కింగ్ ఒలావ్ V ముందు ఒక నిర్ణయం పెట్టినట్లు ఆయన జీవితచరిత్రలో ప్రస్తావించబడుతుంది.తాను ప్రేమించిన సోన్యాను పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే తాను భవిష్యత్తులో మరెవరినీ వివాహం చేసుకోనని తండ్రికి తెగేసీ చెప్పినట్లు అందులో ప్రస్తావించబడింది. హరాల్డ్ ఒక్కగానొక్క పురుష వారసుడు . ఆయన వివాహం చేసుకోకపోతే రాజవంశ వారసత్వమే సమస్యలో పడే అవకాశం ఉంది. చేసేది లేక చివరకు తండ్రి అనుమతి ఇచ్చారు. 1968లో హరాల్డ్ – సో న్యా ల వివాహం జరిగింది.తర్వాత ఆమె నార్వే రాణి అయ్యారు. 1991 జనవరి 17న తండ్రి కింగ్ ఒలావ్ V మరణించడంతో 54 ఏళ్ల వయసులో రాజుగా హరాల్ద్ బాధ్యతలు తీసుకున్నారు. హరాల్డ్ V (Fifth ) గా నార్వే రాజయ్యారు. 35 సంవత్సరాలపాటు నార్వే దేశాధినేతగా కొనసాగారు.

* చారిత్రక ప్రసంగం
రాజకుటుంబాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం ఆయన పాలనా కాలంలోని ప్రధాన అంశంగా చెప్పుకుంటారు..2011 జూలై 22న నార్వే చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడులు జరిగాయి.ఓస్లో, ఉటోయా ద్వీపంలో జరిగిన దాడుల్లో 77 మంది మరణించారు.దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఆ సమయంలో హరాల్డ్ రాజకీయ ప్రసంగం చేయలేదు.ఒక కుటుంబ సభ్యుడిగా దేశ ప్రజల బాధను తాను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. 2016లో హరాల్డ్ చేసిన ఒక ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నార్వే ప్రజలంటే ఒకే మతం, ఒకే జాతి, ఒకే జీవన విధానం కలిగినవారు కాదని చెప్పారు. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్ నుంచి వచ్చినవారూ నార్వేజియన్లేనన్నారు.
దేవుడిని నమ్మేవారు, అల్లాను నమ్మేవారు, ఏ దేవుడినీ నమ్మని వారు అందరూ నార్వేలో భాగమేనన్నారు.
అంతేకాదు, అమ్మాయిలను ప్రేమించే అమ్మాయిలు, అబ్బాయిలను ప్రేమించే అబ్బాయిలు, ఒకరినొకరు ప్రేమించుకునే స్త్రీ పురుషులు…అందరికీ నార్వేలో స్థానం ఉందన్న సందేశం ఇచ్చారు.సంప్రదాయ రాచరిక వ్యవస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తి ఇంత బహిరంగంగా వైవిధ్యాన్ని సమర్థించడం హరాల్డ్ను ఆధునిక రాజుగా నిలబెట్టింది.
* యువరాజ్ గా భారత్ సందర్శన
హరాల్డ్కు భారత్‌తో కూడా ఆసక్తికరమైన సంబంధం ఉంది.ఆయన రాజుగా భారత్‌కు అధికారిక పర్యటన చేయలేదు.కానీ యువరాజుగా ఉన్న సమయంలో 1986 ఫిబ్రవరిలో భారత్‌ను సందర్శించారు.ఈ విషయాన్ని భారత్‌లోని నార్వే సంబంధాలపై భారత రాయబార కార్యాలయ అధికారిక రికార్డులు కూడా ధ్రువీకరిస్తున్నాయి. 2014లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నార్వేను సందర్శించారు.భారత రాష్ట్రపతి నార్వేలో చేసిన తొలి అధికారిక పర్యటన ఇదీ .శాస్త్ర,సాంకేతిక రంగం, విద్య, పరిశోధన, రక్షణ, పర్యావరణం, ఆర్కిటిక్ పరిశోధన తదితర అంశాల్లో ఇరు దేశాల సహకారానికి కొత్త ఊపు వచ్చింది.2026 మేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా నార్వేను సందర్శించారు.. హరాల్డ్ మరణించిన వెంటనే నార్వేలో అధికార శూన్యత ఏర్పడదు. వారసుడు స్వయంచాలకంగారాజ్యాంగం ప్రకారం రాజవుతాడు.అందుకే హరాల్డ్ కుమారుడు హాకోన్ వెంటనే నార్వే కొత్త రాజయ్యారు. నార్వేలో కొత్త రాజుకు భారీ కిరీటధారణ వేడుక తప్పనిసరి కాదు.రాజు మరణించిన క్షణం నుంచే వారసుడి పాలన ప్రారంభమవుతుంది.ఇది కూడా నార్వే రాచరిక వ్యవస్థలోని ప్రత్యేకతగా చెప్పవచ్చు. రాచరికపు ప్రజాస్వామ్యం. ఈ వైరుధ్యమే నార్వే ప్రజాస్వామ్య సౌందర్యం
——————————–

Please tell us what is wrong. Your report will be sent to the website team.
